మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు జడ్పీ హైస్కూల్ నందు కల్లు గీత కార్మికులకు కాటమయ్య రక్షక కవచం కిట్లను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల రక్షణకు కాటమయ్య రక్షణ కవచం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కిట్లు అందజేస్తుందని అన్నారు. కుల వృత్తులకు చేయూత అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. శిక్షణ పొందిన 75 మంది కార్మికులకు కిట్లను అందజేశారు.
కల్లు గీత కార్మికులకు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని పరిష్కరిస్తామని, ఎవరికైనా అందకపోతే వాటిని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిణి ఇందిరా, ఎంపీడీవో శ్రీనివాసరావు, మణుగూరు ఎక్సైజ్ సీఐ రాజిరెడ్డి,మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్,గౌడ్ సంఘం జిల్లా, మండల నాయకులు చనగోని రమేష్, కొంపెల్లి మల్లేష్ గౌడ్, అండెం గంగరాజు గౌడ్, నక్కల శ్రీను గౌడ్, బుర్ర వెంకటేశ్వర్లు గౌడ్, మేకపోతుల వెంకటేశ్వర్లు గౌడ్, గుండగాని రమేష్ గౌడ్, గౌడ కులస్తులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.