calender_icon.png 25 April, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ

16-04-2025 01:17:13 AM

మునిపల్లి, ఏప్రిల్ 15 :తెలంగాణ రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ    ఆదేశాల మేరకు మంగళవారం  మునిపల్లి మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించి 44 మంది లబ్దిదారులకు  కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను  రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షుడు పిల్లోడి సతీష్ అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్  గంగాభవాని, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ బుర్కల పాండు, ఆర్.ఐ సుభాష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.