మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల నియోజకవర్గంలోని కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు బుధవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంటి ఆవరణలో చెక్కులను పంపిణీ చేశారు. వీటితో పాటు సి.ఎం.ఆర్.ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అర్హులకు చెక్కులను పంపిణీ చేశారు. మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులు 211 మందికి 2,11,24,476 రూపాయల చెక్కులను, ముఖ్యమంత్రి సహాయకనిధి కింద 193 మంది లబ్దిదారులకు 63,16,000 రూపాయల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, మంచిర్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురిమిళ్ళ వేణు, వైస్ చైర్మన్ రజిత, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మ, వైస్ చైర్మన్, లక్షెటిపేట్ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాల్లు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.