calender_icon.png 9 October, 2024 | 6:55 PM

హడావిడిగా కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

09-10-2024 04:32:37 PM

జ్వేల్ నియోజకవర్గంలో 1054 చెక్కుల పంపిణీ.

ప్రజా ప్రతినిధుల ప్రమేయం లేకుండానే మండలాల వారీగా  పూర్తిచేసిన అధికారులు, సంతోషించిన లబ్ధిదారులు..

గజ్వేల్ (విజయక్రాంతి) : గజ్వేల్ నియోజకవర్గం వ్యాప్తంగా గత ఏడాది నుండి పెండింగ్ లో ఉన్న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను బుధవారం హడావిడిగా అధికారులు పంపిణీ చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం 1054 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయగా మండలాల వారీగా గజ్వేల్ 372, జగదేవ్పూర్ 115, కుకునూరుపల్లి 96, మర్కుక్ 44, ములుగు 91, కొండపాక 106 వర్గల్ 120, తూప్రాన్ 69, మనోహరాబాద్ 41  చెక్కులను పంపిణీ చేశారు.

గత 15 రోజులుగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ పై గజ్వేల్ లో  కాంగ్రెస్, బిఆర్ ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదాలు, పోలీస్ కేసులు కొనసాగుతుండగా, బుధవారం రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా అధికారులు మాత్రమే చెక్కులను పంపిణీ చేయడం గమనార్హం. మండలాల వారిగా తాసిల్దార్ కార్యాలయాలలో తహసీల్దారులు, ఆర్ఐ, సిబ్బంది చెక్కుల పంపిణీ పూర్తి చేశారు. లబ్ధిదారులు చెక్కుల కోసం క్యూలు కట్టి నిలబడగా  పోలీసు బందోబస్తు మధ్య  వేగంగా చెక్కుల పంపిణీ పూర్తి చేశారు.