22-03-2025 06:51:06 PM
తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో శనివారం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందించి ఆదుకుంటుందని తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో ఎంతోమంది పేదలకు ఆర్ధిక ఇబ్బందులు లేకుండా పోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, అధికార ప్రతినిధి షౌకత్ అలీ, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, కోఆర్డినేషన్ నెంబర్ అంబీర్ శ్యాం రావు, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి, నారాయణరెడ్డి, సంజీవులు, శివాజీ, కందడి వేణు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.