calender_icon.png 17 April, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

08-04-2025 04:52:49 PM

తహసీల్దార్ పులి సాంబశివుడు, మార్కెట్ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో..

కల్లూరు (విజయక్రాంతి): పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పట్టణం, కల్లూరు మండలంకు చెందిన 115 మంది లబ్ధిదారులకు 29,96,500 రూపాయలు విలువగల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అందించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రివర్యులు భట్టి విక్రమార్కకి, తుమ్మల నాగేశ్వరావుకి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.

అనంతరం కల్లూరు మార్కెట్ యార్డులో విశాల సాహకార పరపతి సంగం లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పులి సాంబశివుడు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎస్సై డి.హరిత, కల్లూరు పిఎసిఎస్ సీఈవో బీరవెల్లి శ్రీనివాస రావు, మార్కెట్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు, బాగం ప్రభాకర్ చౌదరి, ఆళ్లకుంట నరసింహారావు, పాపబత్తిని నగేష్, యాసా శ్రీకాంత్, మట్టా రామకృష్ణ, లక్కినేని కృష్ణ, కీసర శ్రీనివాస్ రెడ్డి, జోనబోయిన గోపాల్ రావు, బొల్లం ఉపేంద్ర, తోట సుబ్బారావు కల్లూరు పట్టణం, కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళా, యూత్ నాయకులు పాల్గొన్నారు.