29-03-2025 08:01:00 PM
పిట్లం (విజయక్రాంతి): పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కామారెడ్డి జిల్లా పిట్లం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జంబిగే హన్మండ్లు స్పష్టం చేశారు. పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో 39 మంది లబ్ధిదారులకు శనివారం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హన్మండ్లు మాట్లాడుతూ... "ప్రతి అర్హుడు తమ హక్కును పొందాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతోంది. కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు పేదల జీవనోన్నతికి మరింత తోడ్పాటునందిస్తున్నాయి. నిరుపేద కుటుంబాలకు ఆనందం చేకూర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యం," అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జంబిగా హన్మండ్లు, కాంగ్రెస్ పిట్లం మండల ఎస్సీ నాయకుడు బాల్రాజ్ తదితరులు పాల్గొన్నారు.