11-03-2025 07:58:59 PM
చర్ల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో గల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు(MLA Dr. Tellam Venkata Rao) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ పథకం ద్వారా మండలంలో అర్హులైన 24 మంది లబ్ధిదారులకు ప్రోత్సాహక చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు మాట్లాడుతూ.... ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పేదకుటుంబాలు అప్పుల పాలు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాన్ని నిరంతర ప్రక్రియగా చెక్కులు అందిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం అని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఈదయ్య, చర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు , సొసైటీ చైర్మన్ పరుచూరి రవి కుమార్, మండల అధికారులు పార్టీ కార్యకర్తలు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.