17-04-2025 12:00:00 AM
మంచిర్యాల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని కల్యా ణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు బుధవారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ చేతుల మీదుగా చెక్కులను అందజేశారు.
మంచిర్యా ల కార్పోరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజక వర్గానికి చెందిన 253 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ.2,54,04,435ల చెక్కులను అందజేశారు. అలాగే 345 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ. 1,17,22,500 చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలుశాఖల అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.