మహేశ్వరం, జూన్ 28 (విజయక్రాంతి) : జల్‌పల్లి, బడంగ్‌పేట్ మున్సిపాలిటీల పరిధిలో లబ్ధిదారులకు శుక్రవారం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మహేశ్వరం ఎమ్మె ల్యే సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు మం జూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మా జీ సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా నిధుల విడుదల నిలిచిపోయిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ నిధులను రద్దు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేత..
బాలాపూర్ గ్రామానికి చెందిన ఎం చంద్రకళ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం స్థానిక నాయకులను అభ్యర్థించారు. దీంతో స్థానిక నాయకులు చంద్రకళ ఆరోగ్య పరిస్థితి గురించి మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె ముఖ్యమంత్రి సహాయనిథి నుంచి ఎల్‌ఓసీ మంజూరు చేయించి ఆమె కుటుంబానికి 1.50 వేల రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహిం శేఖర్, కమిషనర్ జీ రఘు, తహసీల్దార్ మాధవిరెడ్డి, కార్పొరేట్లు, కోనూ సభ్యులు పాల్గొన్నారు.