calender_icon.png 5 February, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారులకు జెర్సీల పంపిణీ

05-02-2025 12:53:12 AM

రాజాపూర్, ఫిబ్రవరి 4: రాజాపూర్ మండల పరిధిలోని బీబీ నగర్ పంచాయతీ కి చెందిన బీబీనగర్ కింగ్స్ జట్టుకి బీ అర్ ఎస్ పార్టీ రాజాపూర్ మండల యువత విభాగం ప్రధాన కార్యదర్శి విజయ్ రాథోడ్ క్రీడాకారులకు మంగళవారం జెర్సీలను అందించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వలన మనిషి ఆరోగ్యం ఉండడమే కాకుండా అతని మెదడు కూడా చురుకుగా పనిచేస్తుందని అలాగే క్రీడలను స్నేహభావంతో ఏలాంటి గొడవలకు తారతమ్యం లేకుండా చక్కగా నిష్టగా గెలిచేటట్టు ఆడి మన గ్రామపంచాయతీ పేరు నిలబెట్టే విధంగా ప్రతి ఆటగాడు కషి చేయాలని చెప్పడం జరిగింది బీబీనగర్ గ్రామపంచాయతీలో త్వరలో జరగబోయే పెద్ద టోర్నమెంట్ కి కూడా భారీ స్థాయిలో ప్రైజ్ మనీ ఇచ్చి జడ్చర్ల నియోజకవర్గం నలుమూలల గ్రామాల నుంచి నైపుణ్యమైన ఆటగాళ్లు వచ్చి క్రికెట్ ఆడే విధంగా ఆ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు .