పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు...
మణుగూరు (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu) అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం తోగ్గుడెం గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా రేషన్ కార్డుల పంపిణీ పథకాల్లో లబ్ధిదారుల ఎంపికకు ఆయా పంచాయతీల స్థానిక ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్షమన్నారు.
ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఎవరైనా దరఖాస్తు చేసుకొని వారు ఉంటే గ్రామసభల్లో దరఖాస్తు చేయాలని సూచించారు. కార్యక్రమంలో మణుగూరు తాహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీఓ వెంకటేశ్వర్లు, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, పార్టీ మండల నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.