calender_icon.png 30 April, 2025 | 3:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీడీపీ కార్యకర్తలకు గుర్తింపు కార్డుల పంపిణీ

29-04-2025 10:54:11 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు మహబూబాబాద్ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ కొండపల్లి రామచంద్రరావు(TDP Parliament Constituency Convener Kondapalli Ramachandra Rao) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు బానోత్ కిషన్, బోడ అనిల్, అజ్మీర నవీన్, వీరన్న, స్వామి, రామోజీ, బద్రి పాల్గొన్నారు.