సమాజ హితానికి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి
తల సేమియా చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరం విజయవంతం
146 యూనిట్ల రక్త సేకరణ
రక్తదానంకు ముందుకు వచ్చిన యువతకు హెల్మెట్ల పంపిణీ
పట్టణ సీఐ నరహరి
కామారెడ్డి, మే 24 (విజయక్రాంతి): సమాజ హితం కోసం యువత ముందుకు రావడం అభినందనీయమని కామారెడ్డి పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి అన్నారు. ఆదివారం కామారెడ్డి ఆదిత్య ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. తల సేమియా చిన్నారుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరం నిర్వహించిన రక్తదాతల సమూహం నిర్వాహకులను సిఐ అభినందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న పిల్లల ప్రాణాలను కాపాడడం కోసం ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి, డాక్టర్ అజయ్ పేరాల, బాలు రక్తదానం శిబిరం నిర్వహించేందుకు ముందుకు వచ్చి విజయవంతం చేసినందుకు అభినందించారు. రక్తదానం చేస్తారా రక్తదాతలకు ట్రాఫిక్ నిబంధన పట్ల అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఖర్చుకు వెనుకడుగు వేయకుండా హెల్మెట్లను అందజేయడం సామాజిక బాధ్యత నిదర్శనం అన్నారు.
కార్యక్రమంలో అర్ధ ధాతల సమూహ అధ్యక్షుడు జమీల, జిల్లా అధ్యక్షులు ఎర్రంచంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరి శ్రీదేవి, రెడ్ క్రాస్ సొసైటీ బ్యాట్రన్ సభ్యులు డాక్టర్ జైపాల్ రెడ్డి, ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, అఖిల్, వంశీ, భరద్వాజ్, రామచంద్రం, బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య హాస్పిటల్ సహకారంతో, కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్),ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు,ఆదిత్య హాస్పిటల్ నిర్వాహకులు చిలువేరి మారుతి లు పేర్కొనడం జరిగింది.
నిర్వాహకులు డాక్టర్ నీల బాలు,చిలువేరి మారుతి,డాక్టర్ అజయ్ పేరాల,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్,కోశాధికారి కస్వ వెంకటేష్, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చిలువేరి శ్రీదేవి,కోశాధికారి రెడ్ క్రాస్ సొసైటీ ప్యాట్రన్ సభ్యులు డాక్టర్ జైపాల్ రెడ్డి ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్,అనంతుల అఖిల్,మందుల రామచంద్రం, బట్టు బరద్వాజ్,వంశీ,తల సేమియా బ్లడ్ బ్యాంక్ సభ్యులు పాల్గొనడం జరిగింది.






