16-03-2025 10:13:03 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్రావు (అన్న) వర్దినేని లింగారావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో రవీందర్ రావు-లక్ష్మీ దంపతులు సుమారు 50 మంది పిల్లలకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన వర్ధినేని లింగారావు ఏడాది క్రితం మృతిచెందగా నేడు ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని ఆయన సోదరుడు అనాధ పిల్లలకు స్వయంగా వడ్డించి స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. లింగారావు రైతుగా ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తమలాగే ఎవరైనా దాతలు స్పందన ఆర్పాన్ సేవా సొసైటీకి చేయుతను అందించాలని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త రవీందర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, సేవా సంస్థ నిర్వాహకులు, అనాధ బాలలు తదితరులు పాల్గొన్నారు.