12-04-2025 08:16:37 PM
మంచిర్యాల (విజయక్రాంతి): హనుమాన్ జయంతిని పురస్కరించుకొని నస్పూర్ మున్సిపాలిటీలోని హనుమాన్ ఆలయాలలో, ప్రధాన రహదారి వెంబడి వెళ్తున్న పాధాచారులకు వీ ఎన్ ఆర్ (వూట్కూరి నరేందర్ రెడ్డి) ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పండ్లు పంపిణీ చేశారు. ప్రధానంగా కొండగట్టుకు నడిచి వెళుతున్న హనుమాన్ భక్తులకు, పాదాచారులకి ఇందారం క్రాస్ రోడ్ వద్ద, వివిధ హనుమాన్ ఆలయాలలో మజ్జిగ, వాటర్ బాటిల్స్, పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వీఎన్ఆర్ ఫౌండేషన్ సభ్యులు మల్లెత్తుల రాజేంద్రపాణి-రజిని, రేగండ్ల ఉపేందర్-స్వాతి, సందినేని సతీష్ - మౌనిక, గోపతి తిరుపతి - సుమలత తదితరులు పాల్గొన్నారు.