calender_icon.png 6 February, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెతెస్తా వాలంటరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ

06-02-2025 06:42:44 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో గల బెతెస్తా వాలంటరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రామీణ పేదలకు ఉచిత కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు కె ఆనంద్ మాట్లాడుతూ... మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు లిటరసీ ఇండియా ట్రస్ట్ వారి సహకారంతో కుట్టుమిషన్లు ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. మహిళలు ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాకేంద్రం ప్రాజెక్టు అధికారులు బి వినోద్ రాహుల్, ఎల్ రమేష్, మహిళలు పాల్గొన్నారు.