03-04-2025 11:31:59 AM
చెన్నూర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం(Rice) పంపిణీ పేదలకు వరం లాంటిదని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డి అన్నారు. చెన్నూరు మండలం అక్కపెళ్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గురు వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటీ నెరవేరుస్తూ వస్తుందన్నారు. తెల్ల రేషన్ కార్డు, అంత్యోదయ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సన్న బియ్యం అందేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ చల్లా రామిరెడ్డి, మోహన్ రెడ్డి, సుశీల్ కుమార్, చింతల శ్రీనివాస్, భద్రాచరి, రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.