బెల్లంపల్లి, (విజయక్రాంతి): తాండూర్ మండలంలోని ఐబి చౌరస్తాలో శుక్రవారం అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ, అంజనీ పుత్ర ఎస్టేట్స్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా 650 మట్టి గణపతు లను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా 1116 మట్టి గణపతి లను తయారుచేసి ప్రజలకు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. శనివారం కూడా మట్టి గణపతి లను పంపిణీ చేయనున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అభినవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అభినవ సంతోష్ కుమార్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అంజనీ కుమార్, ఏపీవో నందన్ కుమార్, ఈసీ సత్యనారాయణ, నాయకులు సల్వాజి మహేందర్ రావు, సూరం రవీందర్, ఎలుక రాజన్న, చిలువేరు శేషగిరి, బోనగిరి చంద్రశేఖర్, శ్రీకృష్ణ దేవరాయలు, బియ్యాల నిఖిల్, అభినవ సేవా సంస్థ సభ్యులు పొట్లపల్లి రాజ్ కిరణ్, వేముల ప్రవీణ్, కుమార్, కాసం భాస్కర్, కుంకుమొట్టి సత్యనారాయణ, సామ రమేష్, తొగరి శ్రీనివాస్, హనుమాన్ల విక్రమ్, వినయ్, శివ, సాయి పాల్గొన్నారు.