బైంసా (విజయక్రాంతి): బైంసా మండలం వానల్పాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అదే పాఠశాలలో పనిచేస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులు ఎస్ గణపతి కాశిరెడ్డి మాలతి ఎస్ మల్లికార్జున్ రూపాయలు 15000 విలువచేసే బూట్లను అందజేసి ఉదారత చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు గంగాధర్ గ్రామస్తులు దాతలను అభినందించారు.