మునగాల: కోదాడ నియోజకవర్గం మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామంలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం హైదరాబాదు నగరానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బంగారు లక్ష్మి పుట్టిన రోజు సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు అనాధలకు మానసిక వికలాంగులకు అన్నవితరణ కార్యక్రమంకు ఆర్థిక సహాయాన్ని అందించారు. నరసింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఇలా బంగారు లక్ష్మిని ఆదర్శంగా తీసుకుని వారి వారి కుటుంబంలో జరిగే వివిధ కార్యక్రమాల సందర్భంగా ఇలాంటి ఆశ్రమాలను ఆధునిక దేవాలయాలుగా భావించి నిరాదరణకు గురైన వృద్ధులకు మానసిక వికలాంగులకు అనాధ పిల్లలకు అండగా నిలవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి శ్రీనివాసరావు చెరువుపల్లి లింగయ్య ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.