26-04-2025 06:32:30 PM
మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల వాసవి క్లబ్ కోదాడ ఉపాధ్యక్షులు బండారు సాంబశివరావు పద్మ దంపతుల మనుమరాలు చార్వి పుట్టిన రోజు సందర్భంగా ముకుందా పురం గ్రామంలోని ఇందిరా అనాథ వృద్ధాశ్రమంలో శనివారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాట్లాడుతూ.. పుట్టినరోజు వేడుకలను ఈ విధంగా అనాధ వృద్ధాశ్రమంలో జరుపుకొని సేవా దృక్పథం కలిగి ఉండటం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పందిరి నాగిరెడ్డి,వాసవి క్లబ్ కోదాడ అధ్యక్షులు సేకు శ్రీనివాసరావు. వాసవి క్లబ్ సెక్రటరీ పత్తి నరేందర్, కోశాధికారి వెంపటి ప్రసాద్, డిపిఓ బండారు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు గుడుగుంట్ల సాయి, ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ, జ్యోతి, కుటుంబ సభ్యులు జయకృష్ణ, అశ్విని, సాయి కృష్ణ, తవిడిశెట్టి లక్ష్మీనారాయణ ముక్తేశ్వరి బండారు రంగారావు, తదితరులు పాల్గొన్నారు.