బెల్లంపల్లి (విజయక్రాంతి): వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అచలాపూర్ దుద్దిల్ల దుద్దిళ్ల వేణుగోపాల్ రావు జ్ఞాపకార్ధం అతని సోదరుడు దుద్దిళ్ళ విష్ణు వర్ధన్ 6 ఫ్లడ్ లైట్స్ ను సోమవారం మండల కేంద్రంలోని మాదరం పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో తాండూర్ సీఐ కుమార్ స్వామి చేతుల మీదుగా క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు వర్ధన్ ను సీఐ కుమారస్వామి అభినందించారు. క్రీడాకారులు తమకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, అభినవ సంతోష్ కుమార్, యువ నాయకులు నవీన్, క్రీడాకారులు పాల్గొన్నారు.