calender_icon.png 11 April, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ

04-04-2025 07:18:19 PM

రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి

బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యం పథకాన్ని రేషన్ దుకాణాలలో ప్రారంభించారు. నసురుల్లాబాద్ మండల పరిధిలోని అంకోల్ క్యాంప్  రేషన్ షాప్ నం.2914004 వద్ద,బీర్కూర్ మండలం రైతునగర్ లో రేషన్ షాప్ నం. 2905009 వద్ద   కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్  కిరణ్మయి ,నసురుల్లాబాద్, బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల శ్రీనివాస్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు పాల్గొన్నారు.