calender_icon.png 10 April, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ

03-04-2025 12:00:00 AM

కలెక్టర్ కోయ శ్రీహర్ష 

పెద్దపల్లి, ఏప్రిల్ 2(విజయక్రాంతి): పేదలకు ప్రభుత్వం సమృద్దిగా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష  తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్  పెద్దపల్లి పట్టణంలోని గ్యాస్ గోదాం వద్ద, సుభాష్ నగర్ లో ప్రభుత్వం చేపట్టిన రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే లు మాట్లాడుతూ   రాష్ట్రంలోని రేషన్ షాపులలో తెల్ల కార్డు దారులకు ఇక నుంచి ప్రతి నెల సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని వారు అన్నారు. జిల్లాలో ఉన్న 413 చౌక ధరల దుకాణాల ద్వారా ఇక నుంచి సన్న రకం బియ్యం మాత్రమే పంపిణీ చేయడం జరుగతుందన్నారు.

జిల్లాలో 4 లక్షల క్వింటాళ్ల సన్న రకం బియ్యం రేషన్ షాప్ లో వద్ద అందుబాటులో ఉంచామని, పేదలకు అవసరమైన మేర బియ్యం అందుబాటులో న్నాయని, జిల్లాలో అధిక సంఖ్యలో సన్న రకం ధాన్యం పండటంతో మన జిల్లా అవసరాలు తీరడంతో పాటు  ఆసిఫాబాద్ జిల్లాకు కూడా ఎగుమతి చేశామని కలెక్టర్ తెలిపారు.నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా  చేస్తున్న ఎక్కడ క్వాంటిటీ లో తేడా రాకుండా చూడాలని కలెక్టర్ సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లను ఆదేశించారు. ప్రజల కూడా ప్రభుత్వ అందిస్తున్న సందర్భంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్య మంత్రి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ నుంచి పేదలకు సన్న బియ్యం రేషన్ ద్వారా సరఫరా చేస్తున్నారని,  నియోజకవర్గం లో 55 రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం సరఫరా కార్యక్రమం జరుగుతుందని, అవసరమైన పరిస్థితులు ఉంటే అదనపు షాపులు పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, గతంలో ప్రజలకు రేషన్ ద్వారా దొడ్డు బియ్యం మాత్రమే సరఫరా చేశారని,

దీని వల్ల చాలా వరకు రీసైక్లింగ్ జరిగిందని, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే సంవత్సరానికి రూ. 2 వేల 700 కోట్లు భరిస్తూ పేదల కోసం సన్న బియ్యం సరఫరా  చేస్తున్నామని,  ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి రాజేందర్, డి.యం. శ్రీకాంత్ , సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.