calender_icon.png 1 April, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

29-03-2025 08:53:56 PM

డీసీసీ అధికార ప్రతినిధి -  గూడూరు శ్రీనివాస్ రెడ్డి..

కడ్తాల్ (విజయక్రాంతి): కడ్తాల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు 80 శాతం మంది ప్రజలకు ఆహార భద్రత కోసం దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఉగాది పండగ సందర్భంగా రేషన్ కార్డు లబ్ధిదారులదరికి తెలంగాణ రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఉగాది నుంచి సన్నబియ్యాన్ని రేషన్ షాపుల్లో పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నార్థమవుతోంది.

గడిచిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సన్నబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చామని, ఉగాది పండుగ రోజున సూర్యాపేటలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారుని అన్నారు. రాష్ట్రంలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం చారిత్రక నిర్ణయం తీసుకునే దిశగా కాంగ్రెస్‌ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బీచ్యా నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ వెంకటేష్, మండల పార్టీ ఉపాధ్యక్షుడు మలే మల్లేష్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, మండల అధ్యక్షులు బోస్ రవి, టౌన్ అధ్యక్షులు భానుకిరణ్, ఎస్సీ సెల్ నాయకులు ఎర్రోళ్ల శ్రీకాంత్, డైరక్టర్ చందు గంజి, మహేష్, కుమార్, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.