01-04-2025 04:56:20 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల (విజయక్రాంతి): తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నస్పూర్ లోని పలు రేషన్ దుకాణాలలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావుతో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పేదవారి కడుపు నిండా అన్నం పెట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందన్నారు. రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, సంబంధిత అధికారుల సమన్వయంతో ప్రతి లబ్ధిదారుడికి సన్న బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చౌక ధరల దుకాణాల నిర్వాహకులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.