01-04-2025 08:58:40 PM
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు..
సంగారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని మండలాలలో చౌక ధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం చొప్పున సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభమైనట్లు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు సన్నబియ్యం పౌరసరఫరాల శాఖ గోదాముల నుండి సరఫరా జరిగినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో అన్ని మండలాలలో ఆయా మండలాల చెందిన ప్రజాప్రతినిధులు అధికారులు ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 846 రేషన్ దుకాణాల ద్వారా 378728 రేషన్ కార్డులకు. 79987.81 క్వింటాల రేషన్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. రేషన్ కార్డులో పేర్లు నమోదు అయిన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. నాణ్యమైన సన్న బియ్యం ఈ పథకాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.