calender_icon.png 4 April, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పంపిణీ నిరుపేద కుటుంబాలకు వరం...

03-04-2025 07:36:11 PM

ఎమ్మెల్యే రోహిత్ రావు..

జిల్లా కలెక్టర్ తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..

పాపన్నపేట: రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగిందని ఈ కార్యక్రమం పేద కుటుంబాలకు వరమని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. గురువారం పాపన్నపేట మండల కేంద్రంలోని రేషన్ షాపులో జిల్లా కలెక్టర్ తో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలానికి సంబందించిన 45 రేషన్ షాపులలోని 50 వేల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేదవారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోవాలన్న సంకల్పంతో ఈ పథకాన్ని ప్రారంభించామన్నారు.

పేదలు దొడ్డు బియ్యం తినలేరనే ఉద్దేశంతో పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరుపుకోవాలనే ఆలోచనతో, పేద వారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్నబియ్యం పంపిణీ ప్రారంభించామన్నారు. ఈ పథకాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా పకడ్బందీగా అమలు చేసి పేదవారికి అండగా ఉంటామన్నారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. లబ్ధిదారులు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని వినియోగించుకోవాలని సన్న బియ్యంతో పాటు ప్రభుత్వం అందిస్తోన్న అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేష్ రెడ్డి, అధికారులు, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.