02-04-2025 01:03:54 PM
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని రేషన్ దుకాణం ముందు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేలు ఫ్లెక్సీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రాంబాబు, అజయ్, కటకం వెంకటేశ్వర్లు, ముత్యాల వెంకటేశ్వర్లు, రాములు యాదవ్ నరేష్, అబ్దుల్, జలేంధర్, లింగమల్లు, రంజిత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.