calender_icon.png 3 April, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగోజీవాడిలో సన్న బియ్యం పంపిణీ

01-04-2025 10:47:47 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం సంగోజివాడి గ్రామంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రేషన్ దుకాణంలో సన్నం బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు గైని శివాజీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఉగాది, రంజాన్ పండుగల కోసం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం అందిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు గడ్డం లింగం, భాస్కరరావు, షాబుద్దీన్, రాజయ్య, కమలాకర్ రావు, సుదర్శన్, సలాం తదితరులు పాల్గొన్నారు.