01-04-2025 12:18:13 PM
మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు
మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశాలతో పేదలకు రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ మాట్లాడుతూ... గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల అధికారంలో ఉండి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇస్తామని ప్రకటనలకే పరిమితమైతే.. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన 15 నెలలోనే ఆచరణలో చేసి చూపిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం దొడ్డు బియ్యం స్థానంలో ఏప్రిల్ ఒకటో తారీకు నుండి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నడంతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై రూ.2858 కోట్లు అదనపు భారం పడుతుంది. ఎంత భారం అయినా ప్రజల కోసమే ఈ ప్రజా ప్రభుత్వం.. అని తెలిపారు.
సంక్షేమం అభివృద్ధి సమపాళ్యం అందించడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని శ్రీమంతులే కాదు పేదలు కూడా సన్న బియ్యం తినాలని ప్రజా ప్రభుత్వం ఆకాంక్ష అదే ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధారాస్ సాయిలు సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్ మారుతి హనుమాన్ మందిర్ చైర్మన్ రామ్ పటేల్ యువజన నాయకుడు హనుమంత్ యాదవ్ మండల కాంగ్రెస్ నాయకులు హనుమంతరావు దేశాయి, మాజీ ఎంపీటీసీ శంకర్ పటేల్, వెంకట్ పటేల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.