calender_icon.png 3 April, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నబియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం

02-04-2025 01:11:14 PM

శ్రీమంతులే కాదు.. పేద ప్రజలు సన్న బియ్యం తినాలి

రాయికోడ్,(విజయక్రాంతి): రాయికోడ్ మండలం ధర్మాపూర్ గ్రామంలో రేషన్ షాప్ లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవీణ్ పాటిల్ ప్రారంభించారు . బుధవారం రాయి కోడ్ మండలంలోని ధర్మాపూర్  గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ  ఆదేశాల మేరకు ప్రారంభించామన్నారు. ఒకనాడు తెల్లన్నం అంటేనే తెల్వకుండే పండగ పూటనే తినేది నేడు ప్రతి పేదవాడికి మూడుపూటలా అన్నం పెట్టాలని శ్రీమంతుడే కాదు.. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని  ప్రజా ప్రభుత్వం ఈరోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఆహార భద్రత చట్టాన్ని సోనియా గాంధీ గారు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో  గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఖదీర్, గ్రామ యూత్ అధ్యక్షుడు పాండురంగ రెడ్డి,సీనియర్ నాయకులు శాంత కుమార్,వెంకట్ రెడ్డి,ఉస్మాన్,ఖజమీయ, చాంద్ సాబ్,వహీద్ అలి,ఫక్కిర్ మునిరోద్దీన్,గొల్ల మల్లయ్య,బస్వరాజు, నాజిమ్, అమ్రోద్దీన్,గ్రామస్తులు పాల్గొన్నారు.