08-04-2025 12:00:00 AM
కొల్చారం, ఏప్రిల్ 7 :పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి ఫణీంద్ర కృష్ణ అన్నారు. సోమవారం నాడు మండల పరిధిలోని అప్పాజీపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయిని వెంకట్ గౌడ్, గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు దన్ రాజ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పహాద్ పాషా,నాగరాజు గౌడ్, కిషన్, నర్సింలు, తదితరులు పాల్గొన్నారు.