01-04-2025 10:55:33 AM
తహశీల్దార్ లాలునాయక్
పెన్ పహాడ్: అట్టడుగు వర్గాల అభ్యున్నతి, వారి ఆరోగ్య రక్షణ ద్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'సన్న బియ్యం పంపిణీ' కార్యక్రమం తీసుకున్నట్లు తహశీల్దార్ లాలునాయక్ తెలిపారు. మంగళవారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని సింగారెడ్దిపాలెం, పెన్ పహాడ్, మాచారం గ్రామాల రేషన్ షాప్ లలో సన్నబియ్యంను పంపిణీ చేసి మాట్లాడారు. రేషన్ డీలర్లు సమయ పాలన పాటించి లబ్ధిదారులకు సహకరించాలన్నారు. అంతేకాకుండా బియాన్ని పక్కదారి పట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సన్నబియ్యాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీలర్లు సావిత్రమ్మ, కరీం, సుగుణ తదితరులు ఉన్నారు.