calender_icon.png 11 April, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

04-04-2025 12:40:42 AM

కొల్చారం, ఏప్రిల్ 3 : కుల్చారం మండల కేంద్రంలో ఈ నెల 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి,  గ్రంధాలయ సంస్థ చైర్మన్  సుహాసిని రెడ్డి, డిసిసి అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్,  రాష్ట్ర నాయకులు సోమన్న గారి రవీందర్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. మండలం నుండి అధిక సంఖ్యలో కార్యకర్తలు ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.