calender_icon.png 3 April, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్న బియ్యం పంపిణీ

02-04-2025 12:49:42 AM

వనపర్తి, ఏప్రిల్ 1 (విజయక్రాంతి):   ఏప్రిల్ 2 నుండి  వనపర్తి జిల్లాలో తెల్ల రేషన్ కార్డుల వారికి చౌక ధర దుకాణాల నుండి ఉచితంగా సన్న రకం బియ్యం సరఫరా చేయనున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బుధవారం జిల్లాలోని ఆయా నియోజకర్గాల్లో స్థానిక శాసన సభ్యులు చౌక ధర దుకాణాల్లో సన్న రకం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లాలో 1,59,353 తెల్ల రేషన్ కార్డులు ఉండగా 5,22,367  మంది కుటుంబ సభ్యులు ఉన్నట్లు వెల్లడించారు.