10-02-2025 05:07:28 PM
కొల్లి ఫౌండేషన్ సాకారం..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు ప్రభుత్వం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు సోమవారం కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టాల పంపిణీ చేశారు. కొల్లి ఫౌండేషన్ సర్వారం గిరిజన ఆశ్రమ పాఠశాల, రుద్రంపూర్ జిల్లా పరిషత్ పాఠశాల, పెనగడప జిల్లా పరిషత్ పాఠశాల, హేమచంద్రపురం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్ ను కొల్లి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కొల్లి కల్పనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై అందజేశారు. పిల్లలు ఎంత వరకు పరీక్షలకు సంసిద్ధమయ్యారని తెలుసుకున్నారు.
వాళ్లకి కొన్ని సలహాలు సూచనలు తెలియజేస్తూ భవిష్యత్తులో పై చదువుల గురించి అవగాహన చేయడం జరిగింది. ఉపాధ్యాయుల ద్వారా ఉత్తీర్ణత శాతం అంచనాలను స్వయంగా అడిగి తెలుసుకుని పరీక్షల తేదీ దగ్గర పడుతుండడంతో ఉపాధ్యాయులు వారి మీద ఎక్కువ దృష్టి పెట్టి భయాందోళన తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, కొల్లి ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ రూప్లా నాయక్ వాలంటీర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.