10-02-2025 07:44:04 PM
మందమర్రి (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ జన్మదిన వేడుకలు పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఎంపీ గడ్డం వంశీ జన్మదినం పురస్కరించుకొని పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష పాడ్స్, నోట్ బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. అలాగే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మాయ తిరుపతి మాట్లాడుతూ... పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ కెరటం గడ్డం వంశీకృష్ణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ ను అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్న ఎంపీకి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.