calender_icon.png 2 March, 2025 | 12:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

01-03-2025 08:13:55 PM

తాడ్వాయి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులకు ప్రతినిధులు పెన్నులు, అట్టలు పంపిణీ చేశారు. హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ విజయ స్ఫూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో హెల్పింగ్ బ్రిడ్జి ఫర్ ఎడ్యుకేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... గ్రామాల్లోని పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతోనే పరీక్ష సామాగ్రి అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాకర్ రావు, సంతోష్, రాజు, ఏ మంత్, శ్రీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.