24-02-2025 06:31:57 PM
కమాన్ పూర్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు జన్మదిన వేడుకలను సోమవారం కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షుడు రెబల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి ప్యాడ్లు బుక్, పెన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు రాజ మహేందర్, నవీన్ చారి, చరణ్ రెడ్డి, బొల్లంపల్లి మారుతి, మామిడి మహేష్, మారుతి, అంజి, అభి తదితరులు పాల్గొన్నారు.