19-03-2025 06:15:43 PM
350 మంది విద్యార్థులకు ప్యాడ్లు పంపిణీ చేసిన కిషోర్ కుమార్..
నిజాంసాగర్ (విజయక్రాంతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు 350 పరీక్ష ప్యాడ్లను బుధవారం అందజేశారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి చదివి పరీక్షలు రాస్తున్న 350 మంది విద్యార్థులకు అందజేశారు. మనకోసం మనం స్వచ్చంద సంస్థ నిర్వాహకులు పట్లోళ్ల కిషోర్ కుమార్ తన స్వంత డబ్బులతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్, సామాగ్రిని అందజేశారు. ప్రతి సంవత్సర ప్రభుత్వ పాఠశాలలకు ఏదోవిధంగా సహాయం చేయడం అయన దాతృత్వనికి నిదర్శనం. ఆయనకు మండల విద్యాధికారి తిరుపతి రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు జిల్లా అధ్యక్షులు అల్లాపూర్ కుషాల్, ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి, మహమ్మద్ నగర్ ఎంఈఓ అమర్సింగ్, అచ్ఛంపేట ప్రధానోపాధ్యాయులు వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.