20-03-2025 05:31:15 PM
మద్నూర్ (విజయక్రాంతి): పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను యువజన కాంగ్రెస్ నాయకుడు సోమవారం మహేష్ గురువారం ఉన్నత పాఠశాలలో పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా, మేనూరు గ్రామంలో ఎమ్మెస్ ఫౌండేషన్ ముప్పిడి వాడి శ్రీకాంత్ ల ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులకు మద్నూర్ మండలం పెద్ద ఎక్లరా మేనూరు గ్రామాలలో పదవ తరగతి విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు సోమవార్ మహేష్ మాట్లాడుతూ... 10వ తరగతి విద్యార్థులు చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. విద్యార్థులకు ఉన్నత విద్య పటిష్టంగా ఉంటేనే వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోగలరని నేటి బాలలే రేపటి పౌరులుగా మంచిగా పరీక్షలు రాసి పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగయ్య, ఉమాకాంత్, ఉపాధ్యాయులు, మహేష్ సోమవార్ రాహుల్, కుర్మ సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.