calender_icon.png 21 March, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత

20-03-2025 10:22:47 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల సూర్యాపేట చార్లేట్ చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అద్యక్షులు జాటోతు డేవిడ్ రాజు ఆధ్వర్యంలో స్థానిక మునగాల యస్ఐ ప్రవీణ్ కుమార్ చేతులమీదుగా ట్రినిటీ హైస్కూల్ పదవ తరగతి విద్యార్ధులకు ప్యాంట్లు, పేన్నులు, జామెంట్రీ బాక్స్ లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మాట్లాడుతూ... విద్యార్ధులు సెల్ ఫోన్లు ఎక్కువగా వాడటం ద్వారా సైబర్ నేరాలకు గురికావాల్సి వస్తుందని, పదవ తరగతి వరకు ఫోన్లు అతిగా వాడకుండా అవసరము మేరకే వినియోగించుకోవాలని తెలిపారు. ఏ.ఎ.స్సై శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... 100, 1930, నెంబర్లను గుర్తుపెట్టుకొని అవసరమున్న పెంపుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

చార్లేట్ చారిటబుల్ పౌడేషన్ అద్యక్షులు డేవిడ్ రాజు మాట్లాడుతూ.. సెల్ పోన్ కంటే పుస్తకము భవిషత్ ను తీర్చిదిద్దుకుంది తెలిపారు. జాతీయ మానవ హక్కుల సమైఖ్య మీడియా ప్రతినిధి దుర్గం ప్రభాకర్ పదవ తరగతి విద్యార్ధులను ఆశీర్వదించారు. చారిటబుల్ జనరల్ సెక్రటరీ జాటోతు శేఖర్ విద్యార్ధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధినేత శ్రీమతి జానకీ వనజ, ప్రిన్సిపాల్ ముల్లంగి జాకబ్ రాజు ఉపాద్యాయ బృందం తదితరులు పాల్గోన్నారు.