17-03-2025 04:33:06 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు. బిజెపి నాయకుడు జాకాట ప్రేమ దాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పట్టణ బిజెపి అధ్యక్షురాలు శైలజ హరినాథ్, మాజీ ఎంపీపీ నా రెడ్డి నందా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వంశీధర్ రెడ్డి, సిహెచ్ ఈశ్వర్, గౌలికర్ మహేష్, జాకాట బాబు రాజు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.