13-03-2025 08:40:16 PM
మందమర్రి,(విజయక్రాంతి): ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మండలంలోని పొన్నారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల(Ponnaram Zilla Parishad Secondary School) పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారు. పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్కేల్స్ తదితర పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజిమొద్దీన్ మాట్లాడుతూ సందెల మహిర పుట్టినరోజు సందర్భంగా చిన్నారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ చేశారని ఆయన అన్నారు. పదవ తరగతి పరీక్షలు దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు పరీక్ష సామాగ్రి భారం కాకూడదని ఆశయంతో పరీక్ష సామాగ్రి పంపిణీ చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు 10వ తరగతిలో మంచి మార్కులతో అత్యుత్తమ జిపిఎ లు సాధించాలని కోరారు. ప్రతి ఒక్కరు చిన్నారి మహిర ను స్ఫూర్తిగా తీసుకొని తమ పుట్టిన రోజు లేదా ఇతర శుభకార్యాల సందర్భంగా సమాజ సేవ చేసేందుకు తమ వంతుగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభు దేవ్, పట్టణ అధ్యక్షులు నంది పాట రాజు, మండల అధ్యక్షులు సకినాల శంకర్, సభ్యులు దాడి రాజు, ఎండీ జావిద్, పాష, రవీందర్, నాగరాజు, చరణ్ పాల్గొన్నారు.