06-03-2025 01:13:48 AM
వైరా , మార్చి 5 ( విజయక్రాంతి ): వైరా మండలం సిరిపురం కేజీ ఉన్నత పాఠశాల లో సిరిపురం గర్భిణీ స్త్రీలకు ఉచిత ఆటో సర్వీస్ నిర్వహిస్తున్న షేక్ లతీఫ్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి బుధవారం పంపిణీ చేశారు..
వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వర ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు, పెన్నులు ఇతర సామాగ్రిని వితరణ గా అందించడం జరిగింది. అనంతరం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ను శాలువాతో ఘన సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్, పాఠశాల సిబ్బంది గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు