19-03-2025 06:32:47 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినులకు పిఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు. మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరెడ్డి చేతుల మీదుగా విద్యార్థినిలకు ప్యాడ్స్, పెన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థులు కృషి, పట్టుదలతో చదివి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.
గ్రామీణ ప్రాంతాల్లో విద్యనభ్యసించిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. పదో తరగతితోనే చదువులు నిలిపివేయకుండా ఉన్నత విద్యలను అభ్యసించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఆర్ యూత్ నాయకులు బాదం మణికంఠారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంకొండ వాసు, కాటం వెంకటరామిరెడ్డి, ప్రభాకర్ యాదవ్, అధ్యాపకులు పాల్గొన్నారు.