బెల్లంపల్లి (విజయక్రాంతి) : బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయులు గుండారపు చక్రపాణి, లలిత దంపతులు తమ కుమారుడు రిత్విక్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం తాండూర్ మండలంలోని సేవా జ్యోతి శరణాలయానికి నిత్యవసర వస్తువులను అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. అభాగ్యులకు అండగా సేవాజ్యోతి శరణాలయం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని వారు కొనియాడారు. అనాధలు, భాగ్యులైన చిన్నారుల కోసం పాటుపడుతున్నసేవా జ్యోతి శరణాలయానికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి నిర్వాహకులు గజెల్లి శ్రీదేవి మల్లేష్, ఉపాధ్యాయులు చక్రపాణి కుటుంబ సభ్యులు కార్తికేయన్, శ్రీయాన్ లు పాల్గొన్నారు.