calender_icon.png 11 April, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

04-04-2025 08:30:24 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో సమీపంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి దాతల సహకారంతో ప్రజాసేవ సొసైటీ సభ్యులు నిత్యావసర సరుకులు అందించి తమ ఉదారతను చాటుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత కుటుంబానికి సరుకులు అందించారు. ఈ సందర్బంగా సంస్థ పట్టణ అధ్యక్షులు  నందిపాట రాజకుమార్ మాట్లాడుతూ... పట్టణానికి చెందిన దివంగత పాత్రికేయు లు బొడ్డు రవి వాల్మీకి వర్ధంతి ని పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు నిరుపేద కుటుంబానికి అండగా ఉండా లని బావించి  నిత్యావసర సరుకులు అందించేందుకు ముందుకు వచ్చి బాధిత కుటుంబానికీ అండగా నిలిచారన్నారు. పట్టణ ప్రజలు, దాతలు తమ పెళ్లి రోజులు, పుట్టిన రోజుల సందర్బంగా నిరుపేదలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని కోరారు. దాతలు ముందుకు వచ్చి తమ సంస్థను సంప్రదిస్తే మీ వంతుగా పేద ప్రజలకు సహాయం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచిన బొడ్డు రవి కుటుంబ సభ్యులను ఆదర్శంగా తీసుకొని నిరుపేదలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు జావిద్ పాషా, ఖాజా భాయ్, ఈశ్వర్ లు పాల్గొన్నారు.